🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 15 Aug, 2026 | Page: 1

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి:రాజ్‌కుమార్

చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం: ఏఐవైఎఫ్
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్ అన్నారు.
శనివారం చేర్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల ఏఐవైఎఫ్ మహాసభలు గూడెపు సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా జనగాం రాజ్‌కుమార్ మాట్లాడుతూ చేర్యాల ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరూ ఏకమై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక కార్మికులుగా, కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.చేర్యాల ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం యువత ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ భలో సీపీఐ జిల్లా సీనియర్ నాయకులు ఈరి భూమయ్య, వలబోజు నర్సింహాచారి, బియ్య బాలరాజు, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బిచ్చల శ్రీనివాస్, బొజ్జ బాలకృష్ణ, బోడపట్ల రాజు, కాశబోయిన చరణ్, దాసరి హరిబాబు, కొయ్యడ లింగం, మేకల ప్రభాకర్, సలేంద్ర మహేష్, ముద్దల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home