🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 15 Aug, 2026 | Page: 1

తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం

ఇల్లంతకుంటలో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఉద్యమ యోధులకు గౌరవం
హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ ఎం. రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారికి సమాజం తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు.
ఉద్యమకారుల సేవలను గుర్తించి వారికి గౌరవం కల్పించడం ద్వారా వారి త్యాగాలకు సముచిత గుర్తింపు లభిస్తుందని సర్పంచ్ ఎం. రాజు అన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home