🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 15 Aug, 2026 | Page: 1

జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ రమేష్ రాథోడ్

బంజరపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హిందుస్థాన్ మీడియా, నెక్కొండ: నెక్కొండ మండలం బంజరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు కృషి చేసిన మహనీయుల సేవలను కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. వారి ఆశయాలు, అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్ర్య ఫలాలు భావితరాలకు మరింత మేలు చేకూరేలా గ్రామ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏరా సుజాత రాజు, వార్డు సభ్యులు రాజు, మహేశ్వరి, శ్రీనివాస్, మంద ఉప్ప స్వామి, మౌనిక, రాజు, స్వాతి, అనిల్, వీరస్వామి, రామచంద్ర, పంచాయతీ కార్యదర్శి బిర్రు రాధికతో పాటు జనగాం వెంకటేశ్వర్లు, రాజారాం, సతీష్, తిరుమల్, శేఖర్, భూక్య భద్రం, నాగరాజు, రాజేష్ ఖన్నా, రామన్న, బాబు, భాస్కర్, విక్రం, రాజేందర్, కృష్ణ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home