చిన్నకోడూరు లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
త్రివర్ణ పతాకాలతో మార్మోగిన గ్రామాలు.. దేశభక్తి స్ఫూర్తితో వేడుకలు
హిందుస్థాన్ మీడియా న్యూస్, ప్రతినిధి, సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్, ఆగస్టు 15: చిన్నకోడూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో సలీం, ప్రజాపరిషత్ వద్ద జనార్ధన్, పోలీస్ కార్యాలయంలో చంద్రమోహన్, ప్రభుత్వ పాఠశాలల్లో నాగరాజు రెడ్డి, రాజశ్రీ, అంగన్వాడీ కేంద్రాల్లో సత్యవ్వ, రమ, ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద వాసవి, గణేష్, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కట్కూరి రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద రమేష్ తదితరులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రజలు
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వందల ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన చారిత్రక ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలు, దేశభక్తి, అంకితభావాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
కార్యక్రమాల్లో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎస్సీ, ఎస్టీ సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జేరిపోతుల శ్రీనివాస్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి లక్ష్మణ్ మాదిగ, రాజు, శివకుమార్, మాణిక్యం, లింగం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.