విద్యార్థులకు అండగా యువ నాయకుడు ఆకుల శివకుమార్
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ.. సేవలు ప్రశంసనీయం
హిందుస్థాన్ మీడియా న్యూస్, ప్రతినిధి, చిన్నకోడూర్, సిద్దిపేట జిల్లా, ఆగస్టు 14: పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రామ యువ నాయకుడు ఆకుల శివకుమార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రామునిపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ అన్నారు.
మండల పరిధిలోని రామునిపట్ల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్) పరీక్షకు సిద్ధమవుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆకుల శివకుమార్ పరీక్షా సామగ్రిని అందజేశారు. పరీక్షకు హాజరుకానున్న ఎనిమిది మంది పేద విద్యార్థులకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ మాట్లాడుతూ పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్న ఆకుల శివకుమార్ సేవాభావం ప్రశంసనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తూ ఆయన అందించిన సహాయం పరీక్షల సన్నద్ధతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని, స్కాలర్‌షిప్ సాధించి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.