చేయూత పెన్షన్లలో అర్హులెవరూ మిస్ కావొద్దు :పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్
ఈ నెల 31లోపు దరఖాస్తులు స్వీకరించాలి
హిందుస్థాన్ మీడియా, నెక్కొండ: నెక్కొండ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, ఐఏఎస్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత పెన్షన్ల ఎంపికలో తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలపై సూచనలు చేశారు.
చేయూత పెన్షన్లకు సంబంధించి ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు తదితర అర్హుల నుంచి దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
అర్హత కలిగిన ఒక్క పెన్షన్‌దారు కూడా మిస్ కాకుండా కచ్చితంగా గుర్తించి ఎంపిక చేయాలని, ఈ బాధ్యతను సర్పంచులు తీసుకుని గ్రామస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీధర్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భూక్య రమేష్ రాథోడ్, సర్పంచులు రవికుమార్ వాగ్య నాయక్, రవికుమార్, సూర్య భాయ్, బద్రు, అనిత, కవిత, అఖిల్, నిరోషా, శ్రావణ్, అశోక్, మమత, తిరుమల్, వీరన్న, అలాగే పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.