🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 14 Aug, 2026 | Page: 1

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి :సర్పంచ్ సత్యనారాయణ

సిద్దిపేట జిల్లా ఆగస్టు 14 మద్దూరు మండల కేంద్రంలోని నర్సయపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన యూనిఫామ్ పాఠ్యపుస్తకాలను మద్దూర్ మండల సర్పంచ్ ఫోరంల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ శనగరం సత్యనారాయణ విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శనిగరం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి మీకు మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నరు అనంతరం పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు విద్యార్థులకు నాణ్యత మైన రుచికరమైన భోజనాన్ని అందించాలని సూచించారు భోజనం నాణ్యత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు ఈ సమావేశంలో జడ్పీహెచ్ఎస్ నర్సాయపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి ప్రసూన లక్ష్మీ,మరియు ఉపాధ్యాయులు ఎస్ రాజేశం, జి ఆంజనేయులు, బి నరసింహులు,కె రత్నమాల జి సుభాషిని బి రజినీకాంత్ బి భాగ్యలక్ష్మి అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ సి ఏ లు శ్రీమతి రేణుక శ్రీమతి స్రవంతి మరియు మహిళా సంఘాల సభ్యులు స్వప్న సహిన,పాల్గొన్నారు
🏠 Home