🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 14 Aug, 2026 | Page: 1

మద్దూరు తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండాలి:సీపీఎం డిమాండ్

కొత్త భవనాన్ని దూరంగా నిర్మించొద్దు..
హిందుస్థాన్ మీడియా, మద్దూరు: మద్దూరు తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలోనే నిర్మించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం నాయకులు సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ, గతంలో తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రామానికి దూరంగా నిర్మించడంతో ప్రజలు, కార్యాలయ ఉద్యోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే ఇప్పుడున్న కార్యాలయం కంటే మరింత దూరంలో నూతన భవనం నిర్మించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే ప్రజలకు మరింత ఇబ్బందులు తప్పవని అన్నారు.
మద్దూరు సెంటర్‌లోనే నిర్మించాలి
తహసీల్దార్ కార్యాలయాన్ని మద్దూరు కేంద్రంలో ప్రజలకు సులభంగా చేరుకునే ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. అది సాధ్యం కానిపక్షంలో ప్రస్తుత భవనాన్ని తొలగించి అదే స్థలంలో నూతన భవనం నిర్మించాలని కోరారు.
ప్రజలకు అందుబాటులో లేని ప్రాంతంలో కార్యాలయాన్ని నిర్మిస్తే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆలేటి యాదగిరి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎండీ షఫీ, నాయకులు నారదాసు కనకయ్య, ఆల్ద శివశంకర్, ఆల్ద హరీష్, దువ్వల రాజు, మల్లయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home