త్రివర్ణ పతాకంతో విద్యార్థినుల ర్యాలీ
స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటిన ఎన్‌సీసీ క్యాడెట్లు
హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: సిద్దిపేటలోని పాఠశాలలో 85 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌సీసీ ఫస్ట్ ఆఫీసర్ శ్రీమతి ఉదయశ్రీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం త్రివర్ణ పతాక విశిష్టత, దేశభక్తి, జాతీయ సమైక్యతపై అవగాహన కల్పిస్తూ పాఠశాల పరిసర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని దేశభక్తి నినాదాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నీలకంఠ మనోహర్, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీమతి బాల సరస్వతి, శ్రీ ప్రభు, శ్రీ అశోక్‌రెడ్డి, సుజాత, శ్రీనివాస్ గౌడ్, పద్మావతితో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.