🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 12 Aug, 2026 | Page: 1

కళ్లేపల్లి ప్రాథమిక పాఠశాలకు ప్రింటర్ విరాళంగా ఇచ్చిన దత్తాత్రేయ

పూర్వ విద్యార్థి దాతృత్వం.. ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయ బృందం
హిందుస్థాన్ మీడియా, బెజ్జంకి: విద్యనభ్యసించిన పాఠశాలకు తనవంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో బెజ్జంకి మండలం కళ్లేపల్లి ప్రాథమిక పాఠశాలకు కలర్ ప్రింటర్‌ను విరాళంగా అందించారు అదే పాఠశాల పూర్వ విద్యార్థి, ఆదర్శ యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు బుర్ర దత్తాత్రేయ గౌడ్.
ఆదర్శ యూత్ క్లబ్ తరఫున పాఠశాలకు ప్రింటర్‌ను అందజేసిన దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ, తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం దత్తాత్రేయ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తమ విద్యాలయాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ శేషు గౌడ్, వార్డు సభ్యురాలు బుర్ర పద్మ, ఆదర్శ యూత్ క్లబ్ అధ్యక్షుడు బుర్ర వంశీ, ఉపాధ్యక్షుడు కె. వెంకటేష్, సభ్యులు బుర్ర తిరుపతి, కె. మోహన్, కె. సుదీర్, బి. శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home