పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు : సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్
బంజరపల్లిలో మొక్కల పంపిణీకి శ్రీకారం
హిందుస్థాన్ మీడియా, నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బంజరపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పండ్ల, పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి, ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. చెట్లే జీవనాధారానికి తొలి మెట్లు” అని అన్నారు. మానవ మనుగడకు చెట్లు ఎంతో కీలకమని, ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో బంజరపల్లిని మరింత పచ్చగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర సుజాత రాజు, వార్డు సభ్యులు మౌనిక, రాజకుమార్, శ్రీనివాస్, రామచంద్రం, పంచాయతీ కార్యదర్శి బిర్రు రాధిక, సాంబరాజు రవి, గాలి అనిల్, భాస్కర్, కొంగ ఇందిరా, పొన్నాల అరుణ, జ్యోతి, మచ్చిక జయ, గజ్జల పుష్ప, కొంగ శారద, కొంగ పద్మ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.