నల్లాల బావికి కొత్త ఊపిరి.. బంజరపల్లిలో నూతన పంప్‌సెట్ ప్రారంభం!
నల్లాల బావి వద్ద పంప్‌సెట్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్
గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యం
నెక్కొండ (హిందుస్థాన్ మీడియా):
నూతన పంప్‌సెట్ ప్రారంభం
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బంజరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మొదటి వార్డు నల్లాల బావి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ పంప్‌సెట్‌ను బుధవారం (ఆగస్టు 12) ఘనంగా ప్రారంభించారు. నెక్కొండ మండల సర్పంచుల7 ఫోరం అధ్యక్షుడు, బంజరపల్లి గ్రామ సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ మోటార్ స్విచ్ ఆన్ చేసి పంప్‌సెట్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతర నీటి సరఫరాను అందించేందుకే నూతన పంప్‌సెట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. బంజరపల్లి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు అవసరమైన అన్ని రకాల ప్రాథమిక సౌకర్యాలను విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ రాజేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బిర్రు రాధిక, వార్డు సభ్యులు మహేశ్వరి, కుమార్, శ్రావణ్, అనిల్, నవీన్, శివ మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰