🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 12 Aug, 2026 | Page: 1

చేర్యాలలో విద్యార్థులతో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బల్ల శ్రీనివాస్
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా చేర్యాలలో బీజేపీ మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన బల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతబట్టి ముందుకు సాగుతున్న ప్రతిక్షణం స్వాతంత్ర్య సమరయోధులు, వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తి, సైనికుల అంకితభావం, దేశ సేవ వల్లే భారత్ నేడు ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలుస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ నూతన ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

త్రివర్ణ స్ఫూర్తిని హృదయాల్లో నిలుపుకోవాలి
జాతీయ జెండాను గౌరవంగా చేతబట్టడం మాత్రమే కాకుండా, త్రివర్ణ పతాక స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లో నిత్యం నిలుపుకోవాలని బల్ల శ్రీనివాస్ సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా దేశభక్తిని చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్రా మహేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కాశెట్టి పాండు, మండల ప్రధాన కార్యదర్శి తౌట బాలరాజు, మన్నె సత్యవర్ధన్, ముచ్చంతల సిద్ధారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బయ్యారపు యాదగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి మనీశ్, కొట్టే చంద్రమౌళి, బీజేవైఎం నాయకులు మనోజ్‌కుమార్, ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు.
🏠 Home