🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 12 Aug, 2026 | Page: 1

భువనగిరి రోడ్ల అభివృద్ధికై..గడ్కరీకి ఎంపీ చామల వినతి

ఎన్‌హెచ్‌ల విస్తరణతో పాటు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని విజ్ఞప్తి
హిందుస్థాన్ మీడియా, న్యూఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.బుధవారం న్యూఢిల్లీలో గడ్కరీని కలిసి ఎంపీ పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఎన్‌హెచ్‌-163ను ఆరు లైన్లుగా విస్తరించాలి
ఎన్‌హెచ్‌-163ను ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు అనంతారం, రామకృష్ణాపురం వద్ద అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. భువనగిరి కేంద్రీయ విద్యాలయం, స్వర్ణగిరి ఆలయం, బీబీనగర్ ఎయిమ్స్, సింగన్నగూడెం ప్రాంతాల్లో అవసరమైన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
ఎన్‌హెచ్‌-565పై మౌలిక వసతులు కల్పించాలి
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ఎన్‌హెచ్‌-565పై రోడ్డు విస్తరణతో పాటు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, డ్రైనేజీ, సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని ఎంపీ కోరారు.
అలాగే ఎన్‌హెచ్‌-365పై హనుమాన్ ఆలయం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయితే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
🏠 Home