🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 11 Aug, 2026 | Page: 1

ఎస్సీ, ఎస్టీ కేసులో హుస్నాబాద్ ఏసీపీ దర్యాప్తు


తాడూరులో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు
హిందుస్థాన్ మీడియా, తాడూరు: తాడూరు గ్రామానికి చెందిన చింతల లక్ష్మి ఫిర్యాదు మేరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో భాగంగా హుస్నాబాద్ ఏసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.తనకు సంబంధించిన భూమిని అక్రమంగా దున్నించడంతో పాటు, అక్కడ ఉన్న చెట్లను ధ్వంసం చేసి భూమిని విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నారని చింతల లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదు మేరకు రేఖ, నగేష్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.కేసు దర్యాప్తులో భాగంగా ఏసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలితో పాటు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
🏠 Home