🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 10 Aug, 2026 | Page: 1

పెద్ద లింగపూర్ - అనంతగిరి పోచమ్మ ఆలయ రోడ్డుకు నిధులు కేటాయించాలి : బీజేపీ

రోడ్డు నిర్మాణ హామీ ఏమైంది..? వర్షాలతో అధ్వానంగా మారిన రహదారిపై బీజేపీ నిరసన
హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట, ఆగస్టు 10: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పెద్దలింగపూర్ నుంచి అనంతగిరి పోచమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రోడ్డు నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని విమర్శించారు. అలాగే అనంతగిరి పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఆ హామీ కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రహదారి మరింత అధ్వానంగా మారిందని, దీంతో పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, విద్యార్థులు, ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వత రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అలాగే పోచమ్మ ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు అండగా లచ్చయ్య, మండల కార్యవర్గ సభ్యులు పయ్యావుల బాలయ్య, కునవేని అనిల్, పలుమారి రవి, సీనియర్ నాయకులు అమ్ముల అశోక్, రెడ్డి ముత్యం రెడ్డి, నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home