🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 10 Aug, 2026 | Page: 1

హోరెత్తిన జైల్ భరో నినాదాలు, సిఐటియు నాయకుల అరెస్ట్

మద్దూరులో రాస్తారోకో.. పోలీసులు అడ్డుకుని ఆందోళన విరమింపజేత
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు.దూల్మిట్ట మండల కేంద్రంలో నిరసన తెలిపిన అనంతరం మద్దూరు మండల కేంద్రంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జైల్‌భరో నినాదాలతో ప్రాంతం మారుమోగింది.
సమాచారం అందుకున్న మద్దూరు ఎస్‌ఐ ఆసిఫ్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆందోళనను విరమింపజేశారు.కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న విధానాలను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు చిట్టిపెల్లి సత్తిరెడ్డి, వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ ఆలేటి యాదగిరి, సీఐటీయూ మద్దూరు మండల కన్వీనర్ ఎం.డి. షఫీ, దూల్మిట్ట మండల కన్వీనర్ పోతిరెడ్డి రాజు, రైతు సంఘం మండల కార్యదర్శి బెజాడి మల్లారెడ్డి, నాయకులు ఎల్ల స్వామి, జక్కుల ఎల్లయ్య, వేల్పుల విజయ్, నారదాసు కనకయ్య, ఎం.డి. షాకీర్, బుచ్చయ్య, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అంగన్‌వాడీ యూనియన్ జిల్లా నాయకులు గడిపే స్వరూప, గజ్జల మౌనిక, ఎలిజబెత్ రాణి, జయశ్రీ, అపర్ణ, చంద్రకళ, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home