మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్న జాలపల్లి సర్పంచ్: సీపీఐ నేత నర్సింహా చారి
ఎన్నికైన ఏడాది లోపే అభివృద్ధి పనులకు శ్రీకారం.. పారిశుధ్యం, రోడ్లు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
హిందుస్థాన్ మీడియా, జాలపల్లి: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో చూపిస్తున్న జాలపల్లి గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అత్యధిక మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికైన కమలాకర్, పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికాకముందే గ్రామంలోని పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారని సీపీఐ రాష్ట్ర భూపోరాట కన్వీనర్ వలబోజు నర్సింహాచారి తెలిపారు.గ్రామంలో ఎక్కడ సమస్య కనిపించినా వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇళ్ల సమీపంలో, రోడ్ల పక్కన వర్షాకాలంలో పేరుకుపోయే చెత్త, గడ్డి, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులతో మారుతున్న గ్రామ రూపురేఖలుజాలపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా పరిసరాల్లో రోడ్ల అభివృద్ధి, పరిశుభ్రత పనులతో ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారుతోందని గ్రామస్తులు తెలిపారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలులో నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్య పరిష్కారం కోసం వెంటనే స్పందిస్తున్న సర్పంచ్ పనితీరుపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు చెట్కూరి ఆంజనేయులు, గుండెల్లి సంపత్, యాసరిని బాలరాజు, జక్కు కొమురయ్య, తుపాకుల బాలయ్య తదితరులు సర్పంచ్ సేవలను అభినందించారు.