🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 09 Aug, 2026 | Page: 1

1985–86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం
హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు: చిన్నకోడూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1985–86 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఆత్మీయంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరి, తరగతి గదిలోని సరదా సంఘటనలు, అప్పటి అనుభవాలను ఒకరికొకరు పంచుకుంటూ ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను ఘనంగా సన్మానించి, వారి సేవలను స్మరించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
అనంతరం పూర్వ విద్యార్థులు రోజంతా ఆటలు, పాటలు, ఆత్మీయ సంభాషణలతో సరదాగా గడిపారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న మిత్రుల మధ్య ఆప్యాయత, అనుబంధం ఈ సమ్మేళనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
🏠 Home