కోటిలింగాల అడ్డా ఆటో యూనియన్‌కు నూతన కమిటీ ఎన్నిక, అధ్యక్షుడిగా MD పాషా
కార్మికులకు అండగా ఉంటాం: కల్వకుంట్ల వంశీధర్‌రావు
హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ కోటిలింగాల అడ్డా ఆటో కార్మికుల నూతన సంఘం కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎం.డి. పాషా, ఉపాధ్యక్షుడిగా అనిల్, సెక్రటరీగా ఎం.డి. గౌస్, ఇమ్రాన్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా ఎల్లయ్య, హైమద్, అప్రోజ్లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్‌రావు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా తన సహకారం అందిస్తానని తెలిపారు.
ఆటో కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ ఐక్యంగా పనిచేయాలని పలువురు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆటో కార్మికుల సంఘం మాజీ అధ్యక్షుడు చెప్పాల కిషన్, జిల్లా నాయకుడు కర్రె పోచయ్య, కార్మిక సంఘాల నాయకులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.