🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 08 Aug, 2026 | Page: 1

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట.. రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలు తొలగింపు

ధర్మారం–లక్కపల్లి ప్రధాన రహదారిపై సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య చొరవ
హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ల పొదలను గ్రామ సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య ఆధ్వర్యంలో తొలగించారు.
ధర్మారం మూలమలుపు నుంచి లక్కపల్లి స్టేజ్ వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారికి ఇరువైపులా కొంతకాలంగా ముళ్ల పొదలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య చొరవ తీసుకుని రహదారికి ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను తొలగించారు. రహదారి పరిసరాలను శుభ్రం చేయడంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించే పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించిన సర్పంచ్‌కు స్థానికులు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జక్కుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home