ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళి
గ్రంథాలయంలో మొక్కలు నాటి అంజలి ఘటించిన నాయకులు
గ్రంథాలయ విద్యుత్ కనెక్షన్‌కు సహకరించిన ఏఈ వెంకన్న గౌడ్‌కు శాలువాతో ఘన సన్మానం
చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని చేర్యాల పట్టణంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో గురువారం (ఆగస్టు 06) ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన స్మారకార్థం గ్రంథాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
తెలంగాణ సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయం
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంత రూపకల్పనలో మరియు మలిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు, అందించిన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గ్రంథాలయానికి విద్యుత్ వెలుగులు – ఏఈకి సన్మానం
కొన్నేళ్లుగా సరైన విద్యుత్ సౌకర్యం లేక చీకటిలో కొట్టుమిట్టాడుతూ, విద్యార్థుల చదువుకు తీవ్ర ఇబ్బందిగా మారిన చేర్యాల గ్రంథాలయానికి నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించి, తక్షణమే విద్యుత్ కనెక్షన్ కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపిన చేర్యాల విద్యుత్ శాఖ ఏఈ వెంకన్న గౌడ్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రంథాలయ సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, కౌన్సిలర్ వెలగల దుర్గయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ ఖాజా, గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగుల వెంకటేశం, బింగి శ్రీనివాస్, బుట్టి యాదగిరి, అమ్లిపూర్ సురేష్, గ్రంథాలయ ఇన్‌చార్జి కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..
– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం