🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 05 Aug, 2026 | Page: 1

KGBV లో ఘనంగా పోచమ్మతల్లి బోనాల వేడుకలు

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిన బోనాల సంబరం
హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని **కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)**లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పోచమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థినులు, ఉపాధ్యాయినులు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలు మోసుకుంటూ ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. పాఠశాల ఆవరణ భక్తిమయ వాతావరణంతో కళకళలాడగా, విద్యార్థినులు ప్రదర్శించిన సాంప్రదాయ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శిరీష మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, భావితరాలకు మన ఆచార వ్యవహారాలను పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో విద్యార్థినులంతా విద్యలో రాణించి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శిరీష, పాఠశాల ఉపాధ్యాయినులు, జూనియర్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.
🏠 Home