20 ఏళ్లుగా రోడ్డు కోసం నిరీక్షణ.. వర్షం వస్తే స్కూల్ కు వెళ్లలేని విద్యార్థులు
చిక్కుడువానిపల్లి–రామాజీపేట రహదారిని వెంటనే పునరుద్ధరించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లి–రామాజీపేట గ్రామాల మధ్య రహదారి దుస్థితితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఈ రహదారి సమస్య పరిష్కారం కాకపోవడంతో, గ్రామస్థులే చందాలు వసూలు చేసి తాత్కాలికంగా రహదారిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం వర్షాలు కురిస్తే రహదారి పూర్తిగా బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోతున్నాయని, ముఖ్యంగా చిక్కుడువానిపల్లి నుంచి రామాజీపేట వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపవద్దని అధికారులు సూచించడంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నామని, అయితే వర్షం పడిన రోజుల్లో రోడ్డు సరిగా లేకపోవడంతో పిల్లలను పాఠశాలకు పంపలేకపోతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా, గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగేలా చిక్కుడువానిపల్లి–రామాజీపేట రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.