అక్రమ ఇసుక రవాణా పై మద్దూరు పోలీసుల కొరడా...
రెండు వాహనాలు స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు
హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం పోలీసులు నిర్వహించిన పెట్రోలింగ్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
మద్దూరు ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు గాగిళ్లపూర్–లింగాపూర్ గ్రామాల మధ్య ప్రవహించే మోహితుమ్మెద వాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన నారపల్లి రాజు, బోయిని సిద్ధులు ప్రభుత్వ అనుమతులు లేకుండా అశోక్ లేలాండ్ వాహనం (TG-36-T-0113), జాన్ డీర్ ట్రాక్టర్-ట్రాలీ (TS-36-N-2319) ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
దీంతో ఇసుకతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ ఆసిఫ్ మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉన్న ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.