🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 03 Aug, 2026 | Page: 1

చేర్యాలలో మరో రోడ్డు ప్రమాదం

అయ్యప్పస్వామి ఆలయం వద్ద బైకు ఎక్సెల్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారం ప్రకారం, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికుడు బద్దిపడగ నరసింహారెడ్డి వెంటనే స్పందించి, ఇద్దరు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఒకరు చేర్యాలకు చెందిన వ్యక్తి, మరొకరు తోగుట మండలానికి చెందిన యాదగిరిగా (బైక్ RC ప్రకారం )గుర్తించినట్లు సమాచారం.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో వరుస ప్రమాదాలతో స్థానికంగా కలకలం రేగింది.
🏠 Home