🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 01 Aug, 2026 | Page: 1

అంబాత్రయ క్షేత్రం పై అవమానకర వ్యాఖ్యలు, జర్నలిస్ట్ పై గణేష్ ఫిర్యాదు

హిందుస్థాన్ మీడియా, చేర్యాల: నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అంబాత్రయ క్షేత్రంలో గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆర్‌టీవీ జర్నలిస్టు ఇజ్జగిరి మనోజ్పై చేర్యాల పోలీసులకు ఫిర్యాదు అందింది.
రాంపూర్ గ్రామానికి చెందిన గణేష్ పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో, గురుపౌర్ణమి సందర్భంగా తాను అంబాత్రయ క్షేత్రాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నానని పేర్కొన్నారు. అనంతరం క్షేత్రంలో జరిగిన పూజలు, పీఠాధిపతి డాక్టర్ ఆదిత్య పరాశ్రీ గురించి జర్నలిస్టు ఇజ్జగిరి మనోజ్ అవమానకరంగా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి, వాటిని సోషల్ మీడియాలో వార్తల రూపంలో ప్రచారం చేశారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు తన మత విశ్వాసాలను, భక్తి భావాలను దెబ్బతీశాయని, ప్రజల్లో అపోహలు, ఉద్రిక్తతలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, సంబంధిత వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, వార్తలను పరిశీలించి, ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గణేష్ కోరారు.
🏠 Home