మద్దూర్ మోడల్ స్కూల్ హాస్టల్ లో DEO రమేష్ ఆకస్మిక తనిఖీ
మెనూను తప్పనిసరిగా అమలు చేయాలి అని ఆదేశం
హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ శుక్రవారం మద్దూరు మోడల్ స్కూల్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న వసతి, ఆహార సౌకర్యాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులతో మాట్లాడిన జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సకాలంలో అల్పాహారం, గుడ్లు, మాంసాహారం తదితర పౌష్టికాహారం అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం హాస్టల్ వార్డెన్ జ్యోతికి ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్, ఎంఈవో వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, ఆహార సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.