ఇల్లంతకుంటలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు :తహసీల్దార్ సురేష్
హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయ సేవలు అందించేందుకు ఇల్లంతకుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో "అత్యవసర నియంత్రణ గది (ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్)" ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సురేష్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు, వరద ముప్పు, రాకపోకల ఇబ్బందులు లేదా ఇతర సమస్యలు ఎదురైనా ప్రజలు వెంటనే మండల కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
ప్రజల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా, అధికారులు జారీ చేస్తున్న సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్: 📞 ఇల్లంతకుంట మండల కంట్రోల్ రూమ్: 99637 82919
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అవసరమైన సహాయం కోసం ఈ నంబర్‌కు సంప్రదించాలని తహసీల్దార్ సురేష్ విజ్ఞప్తి చేశారు.