ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కొమురవెల్లిలో మండల సమీక్ష సమావేశం
హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుపై ప్రత్యేక అధికారి అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో చేర్యాల పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, ఎంపీడీవో, ఎంపీఓ, మండలంలోని సర్పంచులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధులు, మురికివాడల పరిశుభ్రత, చెత్త సకాలంలో తొలగింపు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా చేరేలా చర్యలు చేపట్టాలని, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ప్రత్యేక అధికారి అధికారులను ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.