లోకక్షేమం.. సకాలంలో వర్షాల కోసం కొమురవెల్లిలో మహా వరుణ యాగం
శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలో వేదఘోషల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు
హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్ధిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు సోమవారం మహా వరుణ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని సంకల్పించి ఈ ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరశైవ ఆగమ శాస్త్రోక్త విధానంలో మహాగణపతి పూజ, గౌరీ పూజ, రక్షాబంధనం, స్వస్తి పుణ్యాహవాచనం, నాంది సమారాధన, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశ రుద్ర, ఋష్యశృంగ పంచాచార్య కలశ స్థాపన, వరుణ కలశ స్థాపన, ప్రధాన రుద్ర కలశ స్థాపన, మహాగణపతి హోమం, మండప దేవతా హవనం, రుద్ర హోమం, వరుణ మూలమంత్ర హోమం, జయాది హోమం, పూర్ణాహుతి వంటి విశేష వైదిక క్రతువులు నిర్వహించారు.
యాగం అనంతరం 108 పవిత్ర కలశాలతో శ్రీ మల్లికార్జున స్వామివారికి మహా స్నపనం నిర్వహించి, మహామంగళహారతి, మహామంత్ర పుష్ప సమర్పణ, తీర్థప్రసాదాల పంపిణీ, మహదాశీర్వచనం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ మహా యాగాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్ రెడ్డి, ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, వ్యవసాయాభివృద్ధి, లోకకళ్యాణం కోసం ఈ వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.