చేర్యాల మున్సిపల్ పరిధిలో పందుల పెంపకంపై నిషేధం
*పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోనే పందుల పెంపకం చేపట్టాలి.. కమిషనర్ నాగేందర్*
చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పందుల పెంపకాన్ని నిషేధిస్తూ మున్సిపల్ కమిషనర్ నాగేందర్ అధికారిక నోటీసు జారీ చేశారు. పట్టణంలో పందులు స్వేచ్ఛగా సంచరించడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో పందుల పెంపకం చేపట్టరాదని, పందుల పెంపకందారులు పట్టణానికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే పందులను పెంచాలని తెలిపారు.
తెలంగాణ మున్సిపల్ చట్టం–2019లోని నిబంధనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మున్సిపల్ పరిధిలో పందులను పెంచినట్లయితే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
ప్రజారోగ్యం, పట్టణ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని పందుల పెంపకందారులు నిబంధనలు పాటించాలని, ప్రజలు కూడా మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.