🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 23 Jul, 2026 | Page: 1

అయాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలకు విరాళాలు

*కంప్యూటర్, విద్యా సామగ్రి అందజేసిన వెంకట్– సారిక దంపతులు*
హిందుస్థాన్ మీడియా: పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో మరికొండ వెంకట్, సాయి సారిక దంపతుల కుమారుడు అయాన్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాలకు ఒక కంప్యూటర్‌తో పాటు విద్యార్థులకు ఆట వస్తువులు, స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్సిల్స్, పౌచులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకుi ఇలాంటి సహాయ సహకారాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ మరికొండ వెంకట్, సారిక దంపతులను సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. గిరి కిషన్, గ్రామ సర్పంచ్ మేడబోయిన కుమార్, ఉపాధ్యాయులు ఆయిల్ రెడ్డి, కర్రోల్ల విజయ్ కుమార్, సంధ్యారాణి, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home