శంషాబాద్ లో హృదయ విదారక ఘటన
*రోడ్డుపై పసికందును వదిలేసిన కర్కశులు.. సీసీటీవీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు*
హిందుస్థాన్ మీడియా, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న పేగు బంధాన్నే మరిచిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ నవజాత శిశువును రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లడం కలకలం రేపింది.
శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహాల సమీపంలో పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా, రోడ్డుపక్కన శిశువు ఒంటరిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును సురక్షితంగా రక్షించి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పసికందును అక్కడ వదిలేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, శిశువును అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
నవజాత శిశువును ఇలాంటి దారుణ పరిస్థితుల్లో వదిలివేయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పసికందును రోడ్డుపై వదిలేసిన వారెవరు? అనే కోణంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. శిశువు తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.