ఢిల్లీ లో ఉద్రిక్త పరిస్థితులు,పోలీస్ స్టేషన్ కు సోనియా గాంధీ
మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా.. భారీ భద్రత
హిందుస్థాన్ మీడియా, న్యూఢిల్లీ: ఢిల్లీలో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్‌లోనే ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉండగా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు. దీంతో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.
అరెస్టు చేసిన నేతలకు మద్దతుగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ధర్నాకు దిగారు. నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్టేషన్ పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి, అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
నీట్ పరీక్షా వ్యవస్థ, విద్యార్థుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టింది. విద్యార్థులపై పోలీసుల చర్యను ఖండించిన కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం సరికాదని ఆరోపించారు. మరోవైపు చట్టం-శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ పరిణామాలతో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతుండగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.