🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 21 Jul, 2026 | Page: 1

రాత్రంతా ధర్నాకు సిద్ధమైన రాహుల్ గాంధీ

నీట్ లీక్‌పై ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే.. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
హిందుస్థాన్ మీడియా, న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అవసరమైతే రాత్రంతా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మోదీ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు. విద్యార్థుల గొంతులను నొక్కాలని చూడొద్దు. విద్యార్థులపై దాడి చేయడం అంటే దేశ భవిష్యత్తుపై దాడి చేసినట్లే" అని విమర్శించారు.
నీట్ పేపర్ లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన అన్నారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పడంతో పాటు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తోందని ఆరోపించిన రాహుల్ గాంధీ, ప్రజాస్వామ్య పద్ధతిలో చేపడుతున్న నిరసనలకు అడ్డంకులు సృష్టించడం సరైంది కాదన్నారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
🏠 Home