🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 21 Jul, 2026 | Page: 1

దేశం యువతరానిదే...!

*దేశం యువతరానిదే*

భారత అమ్ముల పోధిలో నుండి నేటి యువతరం ఉద్భవించి, రాజకీయాలు నడపాలని,ప్రజాస్వామిక హక్కులకై, దేశ రక్షణ కొరకు, భారత రాజ్యాంగ రక్షణకై ప్రతి విద్యార్థి యువతరం కదం తొక్కాలి. భారతమాత రుణంపై కథలాలీ

జులై 20 నా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చలో పార్లమెంటు కవాతు సందర్భంగా, విద్యార్థి యువజనులు ఇచ్చిన పిలుపులో భాగంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి యువజనులపై నేటి బిజెపి కేంద్ర ప్రభుత్వం అత్యంత విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేసింది. వారు చేసిన నేరం ఏమిటని నేటి ప్రజలుగా ఈ ప్రశ్నను అడుగుతున్నాము. విద్యావ్యవస్థలో మార్పులకై నినాదించడమేనా, నిట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకై, విద్య ఉపాధి అవకాశాలకై ఈ నిరసన తలపెట్టిన యువతరం పై రాజ్యం కర్కశంగా ప్రవర్తించింది. దేశ రాజధాని ఢిల్లీ నడివీధిలో మూడు రంగుల జెండా పట్టి అంబేద్కర్, భగత్ సింగ్, గాంధీ చిత్ర పటాన్ని పట్టుకొని నినదించింది. ఉద్యోగాలు ఉపాధి కల్పనకై రణం బాట పట్టింది. వీరి సమస్యలపై స్పందించకుండా, దాటవేసే ధోరణి ప్రదర్శిస్తూ నెత్తుటి ఏరులను పారించింది. నాడు రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం చేసిన రైతులపై రోడ్లపై మేకులు కొట్టి రైతుల రక్తం కళ్ళ చూసింది. నేడు విద్యార్థి యువజనల రక్తం కళ్ళ చూస్తోంది. జంతర్మంతర్ వద్దకు దేశవ్యాప్తంగా వేలాదిమంది యువతరం చేరుకుంది. అప్పటికే పటిష్టమైన మిలిటరీ పోలీస్ యంత్రాంగాన్ని కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ఏర్పరచుకుంది. అయినా ఆ నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో సాగుతుంది. విద్యార్థి లోకం డిమాండ్లకై ఢిల్లీ వీధులకుండా పెద్ద ఎత్తున పార్లమెంటు వైపు దూసుకెళ్లారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున సందేశం ఇచ్చిన ఈ దేశ ప్రధానమంత్రి గారు నిరసన తెలుపుతున్న విద్యార్థి యువజనులపై స్పందించకపోవడం శోచనీయం. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలకు పాత రెసి మత చాంద్రసవాదాన్ని కులమత ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోస్తుంది. రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకువచ్చి రాజ్యంగాన్ని మార్చాలనే భావనలో నేటి కేంద్ర పాలకవర్గం ముందుకు సాగుతుంది. ప్రశ్నిస్తే నువ్వు ఫలానా దేశస్థుడివని ఫలానా అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తూ పాలన చేస్తుంది. వారి ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టి బిజెపి రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న ఈ కాలంలో నేటి యువతరం భారతావని కోసం చలో పార్లమెంట్ నిర్వహించి, ఈ దేశం మాది ఈ దేశం యువతరానిదే అని నినదిస్తుంటే, ఢిల్లీ కోట ఎర్రబారింది. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న సర్కార్ నయవంచనతో విద్యార్థుల పైకి భాష్పవాయువు గోళాలు రబ్బర్ బుల్లెట్ తో దాడి చేసింది. ఇందులో ఎంతోమందికి తీవ్రమైన గాయాలు రక్తస్రావం జరిగింది. అనేక మంది పై కేసులు నమోదు నమోదు చేయబడ్డాయి. నెత్తురు చిల్లిన రక్తం ఏరులై పారుతున్న, ఆ గొంతు హక్కులకై ఉద్యమం కొనసాగించింది. భరతమాత రక్షణ కై నినదించింది. తమ డిమాండ్ల పరిష్కారానికి చోరవచూపాల్సిందేనని పట్టుబట్టింది. ఇది యావత్ భారతదేశానికి ఒక తరం నేర్పిస్తున్న ఉద్యమ దిక్సూచి, అణచ బడినవాడు, వివక్షతకు గురవుతున్న వాళ్లు ఒక్కటైతే రాజ్యం భయపడుతుంది అనే దానికి నేటి విద్యార్థి యువతరం సాగించిన తిరుగుబాటు ఈ నిరసన ఒక ఉదాహరణ. నాడు బ్రిటిష్ పార్లమెంటుపై దేశ స్వతంత్రం కోసం భగత్ సింగ్ లాంటి వాళ్లు బాంబు విసిరి కరపత్రాలతో తమ నిరసన తెలిపితే ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో చరిత్ర సాక్షిగా తెలుసుకున్నాం. నేటి యువతరం కూడా స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో దేశ రక్షణకై ప్రజాస్వామ్య విలువలకై, రాజ్యాంగ పరిరక్షణకై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగించాల్సిందే. హక్కులకై నిలబడాలి.

వ్యాసకర్త...
గద్దల మహేందర్
జనగామ.. (సామజిక కార్యకర్త)
9963226580

(ఈ వ్యాసం పూర్తిగా రచాయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే )
🏠 Home