🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 20 Jul, 2026 | Page: 1

పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత


ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సీజేపీ కార్యకర్తల ఆందోళన
బారికేడ్లు దాటే యత్నం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
న్యూఢిల్లీ, హిందుస్థాన్ మీడియా: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం పార్లమెంట్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీజేపీ (CJP)కాక్రోచ్ జనత పార్టీ కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడిస్తూ భారీగా ఆందోళన చేపట్టారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న ఆందోళనకారులు, బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు సమాచారం. అనంతరం నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home