🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 19 Jul, 2026 | Page: 1

మరి కాసేపట్లో ప్రపంచ ఫుట్ బాల్ సమరం


మెట్‌లైఫ్ స్టేడియంలో టైటిల్ కోసం తలపడనున్న స్పెయిన్ – అర్జెంటీనా
హిందుస్థాన్ మీడియా, స్పోర్ట్స్ డెస్క్:
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మరికొద్ది గంటల్లో అమెరికాలోని న్యూజెర్సీ మెట్‌లైఫ్ స్టేడియంలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 12:30 గంటలకు ప్రారంభమవుతుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మరోవైపు యువ ఆటగాళ్లతో దూసుకెళ్తున్న స్పెయిన్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అనుభవం, యువశక్తి మధ్య జరిగే ఈ పోరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించనుంది.
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇది మరో చారిత్రాత్మక ఫైనల్. వరుసగా మరో ప్రపంచకప్‌ను సొంతం చేసుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతుండగా, స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ నేతృత్వంలోని జట్టు కొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది.
ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్క ప్రశ్నకే సమాధానం కోసం ఎదురుచూస్తోంది...
కప్‌ను ముద్దాడేది ఎవరు?
మెస్సీ అర్జెంటీనానా?
లేక యువ తుఫాన్ స్పెయినా
🏠 Home